జస్ప్రిత్ బూమ్రా ఆదరగొట్టేస్తున్నాడు. మొన్నటి వరకు కేవలం బౌలింగ్ లో మాత్రమే అదరగొట్టాడు బుమ్రా. ఇక ఇప్పుడు ఆల్రౌండ్ ప్రదర్శనతో  ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఒక వైపు బ్యాటింగ్ లో మరో వైపు బౌలింగ్ ఇంకో వైపు ఫీల్డింగ్ లో తిరుగులేని ప్రదర్శన చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్ లో ఒకే ఓవర్లో 29 పరుగులు చేసి ప్రపంచ రికార్డును కొల్లగొట్టిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ బూమ్రా ఇక ఇప్పుడు బౌలింగ్ లో కూడా మరో రికార్డు క్రియేట్ చేసాడని తెలుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు బుమ్రా.



 ఈ క్రమం లోనే ఐదు మ్యాచుల సిరీస్లో భాగం గా ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.  ఇంగ్లండ్ గడ్డపై ఇప్పుడు వరకు 2014లో భువనేశ్వర్ కుమార్ పడగొట్టిన 19 ఇట్లు అత్యధికంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జస్ప్రిత్ బూమ్రా ఈ రికార్డును తిరగరాశాడు. ఈ లిస్టులో  జహీర్ ఖాన్‌ (2007లో 18 వికెట్లు), ఇషాంత్‌ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్‌ గుప్తే (1959లో 17 వికెట్లు)‌ బుమ్రా, భువీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు అని చెప్పాలి . సాధారణంగా ఇంగ్లాండ్ గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు స్పిన్నర్లకు  దక్కుతూ ఉంటుంది.


 ఎందుకంటే ఇంగ్లండ్ గడ్డపై పిచ్ లు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువగా స్పిన్నర్లు వికెట్లు పడగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. కానీ  బుమ్రా మాత్రం ఒక ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ అరుదైన రికార్డును తన ఖాతా లో వేసుకున్నాడు. ఇకపోతే ఇటీవల కెప్టెన్గా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు బుమ్రా. బూమ్రా కెప్టెన్సీ ఎలా చేస్తాడో అని ఆందోళన చెందిన అందరికీ కూడా అదిరి పోయే కెప్టెన్సీ తో అవాక్కయ్యేలా చేస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: