అయితే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న టీమిండియా ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో ఇంగ్లాండ్ జట్టు తో టీ20 సిరీస్ ప్రారంభించేందుకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ తోపాటు వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 సమరానికి సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఇక నేడే ఇంగ్లాండ్ టీమిండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అయితే ఇటీవలే వైరస్ బారి నుంచి కోలుకుని రోహిత్ శర్మ టీ20 సిరీస్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకునే అవకాశం ఉంది.
సౌతాంప్టన్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య తొలి టీ-20 మ్యాచ్ నేడు రాత్రి పదిన్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అని తెలుస్తోంది. సోనీ సిక్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు అవకాశం ఉంది. కాగా ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఆడతారని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ కూడా తొలి మ్యాచ్ కు దూరమయ్యారు. దీంతో జట్టులోకి హర్షల్ పటేల్, అర్షదీప్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీ20 సిరీస్ లో టీమిండియా ఎలా రాణిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి