ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడుగా ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఒకసారి విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు అంటే చాలు బౌలర్లు సైతం వణికిపోయే విధంగా తన బ్యాటింగ్ హావ నడిపించాడు అనే చెప్పాలి. ఇప్పుడు వరకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బ్రేక్ చేసి రికార్డుల రారాజుగా కూడా అభిమానులతో పిలిపించుకున్నాడు. ఇలా ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ఎంతో నిరూపించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు వరుస వైఫల్యాలతో అంతకంతకు వెనుకబడి పోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే రోజురోజుకీ కోహ్లీ వైఫల్యం కాస్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఎంతోమంది మాజీ క్రికెటర్లు ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని కొంతమంది అంటుంటే కోహ్లీని పూర్తిగా జట్టు నుంచి తప్పించాలి అంటూ మరి కొంతమంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ అటు టీమిండియాకు కూడా రోజురోజుకీ భారంగానే మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే తన పేలవమైన   ఫామ్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. రానున్న ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ భారత్కు అందించడమే తన ముందున్న అతి పెద్ద లక్ష్యం అంటూ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు అని చెప్పాలి. ఇక అందుకు జట్టు కోసం ఏం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గత మూడేళ్ళ నుంచి సెంచరీ చేయలేక.. పరుగులు తీయడానికి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ పై విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మరి ఈ విశ్రాంతి తర్వాత అయినా విరాట్ కోహ్లీ రాణిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: