రోహిత్ శర్మ కెప్టెన్సి చేపట్టిన తర్వాత గత కొంత కాలం నుంచి టీమిండియా తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శనతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. గత కొంతకాలం నుంచి వరుసగా విదేశీ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. ఇక టీ20 సిరీస్ లో కూడా అదే జోరు కొనసాగించింది.


 వరుసగా జరిగిన మూడు మ్యాచ్లలో రెండు మ్యాచుల్లో విజయం సాధించి 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగింది. ఇలాంటి సమయంలోనే కీలకమైన నాలుగో మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. నాలుగో టి20 మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 16 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి ఆరంభించాడు.


 అయితే ఇక 191 పరుగుల టార్గెట్ తో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు టార్గెట్ చేధించలేక  చేతులెత్తేసింది. దీంతో ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా టీ20 సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ సేన అంతర్జాతీయ టి20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విండీస్ పై టీమిండియాకు వరుసగా ఐదవ టి20 సిరీస్ విజయం కావడం గమనార్హం.  అయితే అంతర్జాతీయ టి20 క్రికెట్ లో ఐలాండ్ దేశాలపై భారత్కు ఇది పదమూడవ సిరీస్ విజయం. ఇలా ఐలాండ్ దేశాలపై ఎక్కువ విజయాలు సాధించిన జట్టు గా టీమిండియా రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: