ఇటీవలే న్యూజిలాండ్ జట్టు కి రిటైర్మెంట్ ప్రకటించిన రాస్ టేలర్ తన ఆత్మకథలో చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. అంతేకాదు ఇక భారత క్రికెటర్లలో ఉన్న అనుబంధాలను కూడా ఇటీవలే గుర్తు చేసుకున్నాడు రాస్ టేలర్. ఇక న్యూజిలాండ్ క్రికెట్ లో ఎదుర్కొన్న వివక్ష ను కూడా చెబుతూ సంచలనమే సృష్టించాడు అనే చెప్పాలి.


 ఈ క్రమంలోనే వార్నర్ తో జరిగిన సంభాషణల గురించి ఇటీవల సోషల్ మీడియాలో చెప్పగా అది కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక సందర్భంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నోరు మూయించాను అంటూ బ్లాక్ అండ్ వైట్ పేరుతో తీసుకువచ్చిన తన ఆత్మకథ పుస్తకంలో ప్రస్తావించాడూ. రాస్ టేలర్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా కలిసి ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు ఆడారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఇక జట్టు యజమానులు పార్టీ ఇవ్వగా ఆ పార్టీలో మద్యం ఎక్కువ తాగిన డేవిడ్ వార్నర్ ఓవర్గా మాట్లాడుంటే ఏకంగా డేవిడ్ వార్నర్ మేడ మీద చేయి పెట్టి కాస్త అదిమి పట్టి ఎక్కువ అరవకు అంటూ నోరు మూయించా అంటూ గుర్తు చేశాడు.



  ఒక రాత్రి డేవిడ్ వార్నర్ నేను కలిసి మద్యం తాగాము. ఆ సమయంలో డేవిడ్ వార్నర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇక మద్యం తాగిన తర్వాత మా గది లోకి వెళ్లేందుకు లిఫ్ట్ లోకి చేరుకున్నాము. ఇక అతని తీరు లో మాత్రం మార్పు రాలేదు. మరింత ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే అతని మెడచుట్టూ గట్టిగా చేతులు పెట్టి అరవకు అంటూ చెప్పాను. అప్పుడు అతను స్పందిస్తూ. మీ ద్వీపవాసులు బలంగా ఉంటారని మర్చిపోయాను.. హెడ్ లాక్ తో నువ్వు అద్భుతమే సాధించావు అంటూ అన్నాడు. క్రికెట్ లో మేము మంచి స్నేహితులుగా ఉన్నామంటూ తన ఆత్మ కథ పుస్తకం లో రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: