ఈ క్రమంలోనే ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే రెండు వన్డేల్లోనూ ఎంతో అలవోకగా విజయం సాధించిన భారత జట్టు మూడో వన్డేలో ఎంతో ఉత్కంఠ భరితమైన పోరులో 13 పరుగుల పలక తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కు టీమిండియా కెప్టెన్గా ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. అయితే ఇటీవలే మూడో వన్డే గెలిచిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో చేసుకున్న సెలబ్రేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
కాలా చష్మా అనే పాటకు టీమిండియా లోని ఆటగాళ్లు అందరూ కూడా డాన్స్ తో ఉర్రూతలూగించారు. యంగ్ ప్లేయర్స్ ఇషన్ కిషన్, సిరాజ్, శుభమన్ గిల్ రెచ్చిపోయి చిందులు వేశారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. విజయాన్ని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అని ఒక జాప్యం జోడించి శిఖర్ దావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇక ఈ వీడియోని పోస్ట్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి