విరాట్ కోహ్లీ.. భారత జట్టు తరఫున ప్రపంచ క్రికెట్ లో హవా నడిపించిన ఆటగాడు. సెంచరీల మీద సెంచరీలు చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన మొనగాడు. దిగ్గజ బౌలర్ అయిన సరే కోహ్లీకీ బౌలింగ్ చేయాలంటే కాస్త వెనకడుగు వేసేలా చేసిన ధీరుడు.. ఇక కోహ్లీ బ్యాటింగ్ ధాటికి దిగ్గజాలు సాధించిన రికార్డులు సైతం సలాం కొట్టిమోకరిల్లాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫిట్నెస్ లో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విరాట్ కోహ్లీ ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.. సెంచరీలు చేయడం కాదు సాదాసీదా ఇన్నింగ్స్ ఆడటానికి కూడా తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఇక కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో చేరాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పాకిస్థాన్తో జరగబోయే మ్యాచ్లో సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు అన్నారు.


 అయితే ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఆటతీరు అభిమానులు అందరిలో కొత్త ఊపిరి నింపింది. ఎంతో అలవోకగా షాట్లు కొడుతూ సిక్సర్లు ఫోర్లతో విరాట్ కోహ్లీ చెలరేగిపోయిన తీరు చూస్తే ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అని ప్రేక్షకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. 35 బంతుల్లో 34 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇందులో మూడు ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గమనార్హం. కోహ్లీ బ్యాటింగ్ అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో పాకిస్థాన్ స్పిన్నర్ నవాజ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సెంచరీ పై అభిమానుల్లో ఆశలు పెంచిన  కోహ్లీ చివరకు నిరాశ పరిచాడు  అని చెప్పాలి. కానీ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే మాత్రం మళ్లీ టచ్ లోకి వచ్చినట్లు గానే కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: