మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చేంతవరకు కూడా భారత ఇన్నింగ్స్ అటా ఇటా అన్నట్లుగానే సాగుతూ ఉంది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్ లో దూసుకుపోయాడు అని చెప్పాలి li. 26 బంతుల్లో 6 ఫోర్లు నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఒక రకంగా హాంకాంగ్ బౌలర్లపై శివతాండవం చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ దంచి కొడుతూఉంటే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ సూర్యను చూస్తూ ఉండిపోయాడు.. అయితే విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు అయినప్పటికీ తన సహచరులు ఎవరు మంచి ప్రదర్శన చేసినా కూడా ప్రశంసిస్తూ ఉంటాడు.
ఈక్రమంలోనే 360 డిగ్రీస్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ కి ఫిదా అయిపోయిన విరాట్ కోహ్లీ సూర్యకుమార్ ను మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు అని చెప్పాలి. బౌ డౌన్ తో సురేష్ కుమార్ యాదవ్ కు గౌరవం ఇచ్చాడు. అయితే ప్రపంచ క్రికెట్ లో కింగ్ లాంటి కోహ్లీ నుంచి ఇలాంటి అరుదైన గౌరవం అందడంతో సూర్యకుమార్ యాదవ్ సైతం ఎంతో సంతోషపడిపోయాడు అని చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ కు బౌ డౌన్ ఇస్తున్న వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి