టీమిండియా డేర్ అండ్ డాషింగ్ మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో హాట్ టాపిక్ మారిపోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు గౌతం గంభీర్  చేసిన వ్యాఖ్యలు చూస్తే కాస్త అతి చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది.  కానీ మరి కొన్నిసార్లు మాత్రం నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతాడు అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు గౌతం గంభీర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్లో హీరో ఆరాధన ఆపేస్తే ఇప్పటికైనా మంచిదే అంటూ వ్యాఖ్యానించాడు గౌతం గంభీర్.


 అయితే గౌతం గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక పెద్ద కారణమే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా టీమిండియా చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగింది అనే విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది టీమిండియా. బ్యాటింగ్లో  విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో చెలరేగి పోయాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ పై ఆహా ఓహో అంటూ అందరూ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు.


 ఇప్పటికీ ఈ విషయం పై ప్రశంసలు కురిపిస్తునే ఉన్నారు.  కానీ అదే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో పరుగులను కట్టడి చేస్తూ అద్భుతమైన బౌలింగ్ తో  ఐదు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయంపై మాట్లాడినా గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సెంచరీ చేస్తే అందరూ మెచ్చుకున్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 5 వికెట్లు తీస్తే ఎవరు గుర్తించలేదు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్లో ఇలాంటిది ఎంతో దురదృష్టకరమని.. హీరో ఆరాధన వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. క్రికెట్లో అయినా రాజకీయాల్లో అయినా
 టీమ్ మొత్తాన్ని అభినందించాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు గౌతం గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: