ప్రస్తుతం టీ 20 డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇండియా పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మూడు టీ 20 లను ఆడనుంది. అందులో మొదటి మ్యాచ్ ప్రస్తుతం పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ మొదట ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పు అన్నది తెలియడానికి చాలా సమయం పట్టింది. ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియా కు రాహుల్ మరియు రోహిత్ లు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని చూసినా ఫాస్ట్ గా ఆడే క్రమంలో రోహిత్ అవుట్ అయ్యాడు, ఆ వెంటనే కోహ్లీ కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత రాహుల్ కు జత కలిసిన సూర్య కుమార్ యాదవ్ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అయితే రాహుల్ అర్ద సెంచరీ 55 పరుగులు అయ్యాక అవుట్ కాగా, సూర్య మాత్రం 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటి వరకు ఒక రకంగా సాగిన ఇండియా ఇన్నింగ్స్ అప్పుడు సునామీ రాబోతోందని ఎవ్వరూ ఊహించలేదు. హార్దిక పాండ్య తన ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మొదలు పెట్టి ఒక సునామీని సృష్టించాడు. హార్దిక్ ఒక్కడే కేవలం 30 బంతుల్లో 71 పరుగులు చేశాడు అంటే ఆస్ట్రేలియా బౌలర్లను ఎంత ఊచకోత కోశాడో అర్ధం చేసుకోవచ్చు. ఇతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి.

హార్దిక్ కనుక ఆ రకంగా ఆడకపోయి ఉంటే ఇండియా ఆ మాత్రం స్కోర్ చేయడం వీలయ్యేది కాదు. ముఖ్యంగా కార్తీక్ మరియు క్సర్ పటేల్ లు విఫలం అయ్యారు. పంత్ ను తీసేసి కార్తీక్ ను తీసుకోవడం వలన ఉపయోగం లేకుండాపోయింది. హార్దిక్ ఇదే ఫామ్ ను కనుక కొనసాగిస్తే వరల్డ్ కప్ మనదే.




మరింత సమాచారం తెలుసుకోండి: