విరాట్ కోహ్లీ.. ఇతని పేరు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఇతనికి ఉన్న పాపులారిటీ విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మారుమోగిపోయేలా చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇతడు సాధించిన రికార్డులు కూడా క్రికెట్ ప్రేక్షకులందరికీ విరాట్ కోహ్లీ ఎవరో చెప్పకనే చెబుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకుల ఆరాధ్య క్రికెటర్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. కేవలం మన దేశంలో మాత్రమే కాదు విదేశాలలో సైతం విరాట్ కోహ్లీకి  అమితంగా అభిమానించేవారు కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి.


 ఇలా ఒక సాదాసీదా క్రికెటర్ గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి దిగ్గజ క్రికెటర్గా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ గా ఎన్నో ఏళ్ల పాటు టీమ్ ఇండియా అని నడిపించిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. అయితే మిగతా బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ కాస్త భిన్నమైన ఆటగాడు. సాధారణంగా బ్యాట్స్మెన్లు చేజింగ్ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే కాస్త తడబాటుకు గురి అవుతూ ఉంటారు.  కానీ విరాట్ కోహ్లీ మాత్రం చేజింగ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేసింది కూడా టీమిండియా చేజింగ్ సమయంలోనే కావడం గమనార్హం.


 ఒక రకంగా లక్ష చేదనలో విరాట్ కోహ్లీ వేటాడే చిరుతపులిలా కనిపిస్తాడు అని చెప్పాలి. ఇక చేజింగ్లో కోహ్లీ రికార్డులు చూసుకుంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు వరకు 43 చేజింగ్ ఇన్నింగ్స్ లలో ఆడాడు కింగ్ కోహ్లీ. అయితే 1898 పరుగులు చేశాడు అని చెప్పాలి  ఇక విరాట్ కోహ్లీ యావరేజ్ 73, కాగా స్ట్రైక్ రేట్ 136.4 గా ఉంది. ఇక ఇంకో విషయం ఏమిటంటే 43 ఇన్నింగ్స్ లలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్ కి వికెట్ కోల్పోయాడు విరాట్ కోహ్లీ. దీనిబట్టి చేజింగ్లో విరాట్ కోహ్లీ ఆధిపత్యం ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అభిమానులు అతన్ని చేజింగ్ కింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: