130 కోట్ల భారత ప్రజలందరికీ కూడా గోల్డెన్ బాయ్ గా సుపరిచితుడుగా  మారిపోయిన నీరజ్ చోప్రా గురించి ఎప్పుడు ఏ వార్త బయటకు వచ్చినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మిగతా అథ్లెట్ లతో  పోల్చి చూస్తే అటు నీరజ్ చోప్రా మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అతని సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎప్పుడో ఒక్క పోస్ట్ మాత్రమేబయటికి వస్తూ ఉంటుంది. అందుకే ఇక ఈ గోల్డెన్ బాయ్ గురించి ఏదైనా వార్త వస్తే అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.


 జావలిన్ త్రో విభాగంలో గతంలో టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించి పెట్టిన నీరజ్ చోప్రా ఆ తర్వాత కూడా అదే రీతిలో ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టోక్యో ఒలంపిక్స్ లో అయితే ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ  భారత్కు గోల్డ్ మెడల్ అందించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశాడు అని చెప్పాలి. భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టాడు. అయితే టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ తర్వాత వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన నీరజ్ చోప్రా  తర్వాత మాత్రం మీడియా కంటే ఎక్కువగా పడలేదు.


 ఇక ఇప్పుడూ నీరజ్ చోప్రా కి సంబంధించిన ఒక వీడియో ట్విటర్ వేదికగా తెగ చక్కర్లు  కొడుతుంది. గుజరాత్ లోని వడోదరలో జరిగిన ఈవెంట్లో ఇటీవలే పాల్గొన్నాడు నీరజ్ చోప్రా. గర్భ వేదిక వద్దా పూజలు చేయడం గమనార్హం. ఆ తర్వాత కొంతమంది సభ్యులతో కలిసి కాలు కదిపి డాన్స్ కూడా చేశాడు నీరజ్ చోప్రా.  ఇక నీరజ్ చోప్రా గర్భ నృత్యాన్ని చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  కాగా నీరజ్ చోప్రా పూజలు చేసేందుకు వెళ్లిన సమయంలో జనం భారీగా నినాదాలు చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: