అయితే అప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో పట్టు బిగించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా ఆ తర్వాత రెండు మ్యాచ్లలో మాత్రం విజయం సాధించింది. ఇటీవలే అరుణ్ జెట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుని సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.
అదే సమయంలో ఇటీవలే మూడో వన్డే మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు.. అటు ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది అని చెప్పాలి. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సరసన భారత్ చోటు సంపాదించుకుంది. 2003లో ఆస్ట్రేలియా ఒక క్యాలెండరు ఇయర్లో 38 విజయాలు సాధించింది. అయితే మొన్నటి వరకు భారత్ ఒక క్యాలెండర్ ఇయర్ లో 37 విజయాలు సాధించిన జట్టుగా కొనసాగింది. మూడో వన్డేలో విజయంతో సొంత రికార్డును బ్రేక్ చేయడమే కాదు.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి