ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీన ఎవరు ఊహించిన విధంగా వరల్డ్ కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ప్రస్తుతం కొన్ని జట్లు వార్మప్ మ్యాచ్ లను ఆడుతూ ఉన్నాయి.  ఇక మరికొన్ని జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్లలో మునిగి తేలాయి అని చెప్పాలి. ఇక ఇలా వరుసగా మ్యాచ్లు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్  అందిస్తున్నాయి అని చెప్పాలి. ఈనెల 22వ తేదీ నుంచి సూపర్ 12 మ్యాచ్లు వరల్డ్ కప్ లో భాగంగా ప్రారంభం కాబోతున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక సూపర్ 12 మ్యాచ్లను ఆడేందుకు అన్ని జట్లు కూడా సంసిద్ధం అవుతున్నాయి అని చెప్పాలి.. కాగా ఏడాది మరోసారి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్క అని అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా గట్టి నమ్మకంతోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్ అభిమానుల ఆశలపై అటు వరుణుడు నీళ్ళు చల్లబోతున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.


 ఇక నేటి నుంచి పది రోజులపాటు ఆస్ట్రేలియా మొత్తం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన జరగబోయే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వరుడ గండం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే సూపర్ 12 దశకు ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యం అనే విషయం తెలిసిందే. ఒకవేళ వర్షంతో మ్యాచులు రద్దు అయితే మాత్రం ఇరుజట్లకు కూడా ఒక్కో పాయింట్ వస్తుంది. ఇదే జరిగితే చివర్లో రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుణుడు టీ20 వరల్డ్ కప్ పై కాస్త కరుణ చూపాలని ఎంతోమంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: