గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంతలా వేధిస్తూ ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ లో ఎంతో మంది ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంbలోనే ఇక ఎంతో మంది క్రికెట్ అభిమానులు అందరూ కూడా నిరాశల్లో మునిగి పోతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ ఆడబోయే టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయ్.


 జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న రవీంద్ర జడేజా వరల్డ్ కప్ కి ముందే మోకాలి గాయం కారణం  గా దూరమయ్యాడు. ఇక జడేగా లాంటి కీలక ప్లేయర్ దూరం కావడం ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. అయితే జడేజా కు గాయమైంది అన్న విషయాన్ని మరిచి పోక ముందే మరో కీలక ఆటగాడు బుమ్రా కూడా గాయం బారిన పడి ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. అంతలోనే బుమ్రా స్థానాన్ని భర్తీ  చేస్తాడు అనుకున్న దీపక్ చాహార్ కూడా వెన్నునొప్పి గాయం తో చివరికి జట్టుకు దూర మయ్యాడు


 ఇలా వరుసగా టీమ్ ఇండియాను గాయాలు బెడద వేధిస్తూనే ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవలే మరో టీం ఇండియా క్రికెటర్ గాయం బారిన పడ్డాడు. ఇండియా తరపున ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ అయ్యర్ ఇటీవలే గాయం పాడిన పడ్డాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు వెంకటేష్ అయ్యర్. ఇటీవల  మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్  సమయంలో కాలు యాంకీల్ విరగడంతో చివరికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మొత్తం దూరమయ్యాడు అని చెప్పాలి. ఇలా టీమిండియ ని వరుసగా గాయాల బెడద వేధిస్తూ ఉండడం పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: