ఐపీఎల్ లో రూల్స్ ఎలా ఉంటాయి అన్న విషయం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలుసు. అక్కడ టేబుల్ టాపెర్ గా ఉన్న ఒక జట్టు దురదృష్టవశాత్తు ఓడిపోతే ఇక మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే వరల్డ్ కప్ లలో మాత్రం ఇలాంటి రోల్ ఎక్కడా లేదు అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో ఎన్ని విజయాలు సాధించినా సరే సెమీఫైనల్ లో ఒక్కసారి తడబడి ఓటమి చవి చూసాము అంటే చాలు చివరికి ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఎన్నో జట్లు నిరాశలో మునిగిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇలా లీగ్ మ్యాచ్ లో బాగా రాణించిన జట్లను సెమీఫైనల్ లో ఒక్క మ్యాచ్ ఓడిపోవడం ద్వారా ఇక ఇంటికి పంపించడం ఎంతవరకు సబబు అన్న విషయంపై గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రూల్స్ లో మార్పులు తీసుకురావాలి అంటూ ఐసీసీకి పలు సూచనలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో విరాట్ కోహ్లీ కూడా టేబుల్ టాపర్ కి మరో ఛాన్స్ ఉండాలని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.


 గ్రూప్ స్టేజిలో లో వరుస మ్యాచ్ లో గెలిచాం. కానీ సెమీఫైనల్ లో ఒక్క మ్యాచ్ ఓటమితో ఓటమితో ప్రపంచకప్ నుంచి తప్పించడం కరెక్టేనా టేబుల్ టాపర్ కు ఐపీఎల్లో లాగా మరో ఛాన్స్ ఇవ్వాలి అంటూ విరాట్ అప్పుడు వ్యాఖ్యానించడం సంచలనంగా మారిపోయింది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్స్ సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐసిసి  కూడా ఐపీఎల్ ఫార్ములా ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. గ్రూప్ స్టేజిలో మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి. అయితే రెండు మ్యాచ్ లలో ఫైనలిస్టులను తెల్చేయటం కరెక్ట్ కాదు ఐపీఎల్ లాగా క్వాలిఫైయర్స్ ఎలిమినేటర్ మ్యాచులు పెడితే ఐసీసీ టోర్నీలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతాయి అంటూ ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: