టీమిండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ కు బీసీసీఐ అన్యాయం చేస్తుంది. అతను ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ కూడా భారత జట్టులో ఎంపిక చేయడం లేదు. ఒకవేళ సంజూ శాంసన్ ను భారత జట్టులోకి తీసుకున్నప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం కల్పించడం లేదు. ఇలా టాలెంట్ ఉన్నప్పటికీ అతన్ని ఎందుకో బీసీసీఐ కావాలనే తొక్కేస్తుంది. ఇప్పటికైనా బీసీసీఐ తన పంతాను మార్చుకొని విఫలమవుతున్న ఆటగాళ్ల స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకుంటే భారత జట్టుకు తిరుగు ఉండదు.. ఇవే గత కొంత కాలం నుంచి సంజూ శాంసన్ విషయంలో  సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటలు. అతనికి సరైన అవకాశాలు రాకపోవడంతో అభిమానులు బీసీసీఐ పై తీవ్ర అగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 అడపదడప అవకాశాలు అందుకున్న సమయంలో సంజూ శాంసన్ మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఎందుకో తుది జట్టులో అతనికి అవకాశం దక్కడం  మాత్రం గగనం గానే మారిపోయింది అని చెప్పాలి. మొన్నటికి మొన్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరితో దిగిన టీమిండియాలో ఒకసారి కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు సంజూ శాంసన్. ఇక ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో అవకాశం దక్కించుకొని మంచి ప్రదర్శన చేశాడు. కానీ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం అతని తప్పించడం అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది .

 సంజూ శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించడం పై విమర్శలు వస్తున్న వేల వన్డే జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ రద్దు అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన శిఖర్ ధావన్ ఆరో బౌలర్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని భావించాము. అందుకే సంజూ శాంసన్ కు బదులు దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల చాహర్ ను కూడా తుది జట్టులోకి ఎంపిక చేసాము  అంటూ వివరణ ఇచ్చాడు  ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి: