సాధారణంగా ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లు చేసే చిన్న చిన్న చిలిపి పనులుఅందరికీ నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఏవైనా జరిగాయి అంటే చాలు అదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.


ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండు  ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్యాటింగ్ కు ఎంతగానో అనుకూలించే పాకిస్తాన్ పిచ్ లపై ఇక మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు వీరవిహారం చేశారు. ఈ క్రమంలోనే వరుసగా సెంచరీలతో చెలరేగిపోయి ఎన్నో ప్రపంచ రికార్డులను క్రియేట్ చేశారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాటర్లు సైతం ఇలాగే భారీ పరుగులతో రెచ్చిపోయారు అని చెప్పాలి. దీంతో అందరూ ఇక ఈ సెంచరీల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.


 ఇలాంటి చర్చలో భాగంగా ఏకంగా ఒక ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన చర్చ కాస్త తెర మీదకి వచ్చింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా బంతిని షైన్ చేయడానికి బౌలర్లు ఏకంగా ప్యాంటుకి రుద్దడం లాంటివి చేస్తూ  ఉంటారు. ఇక్కడ జో రూట్ మాత్రం ఏకంగా సహచర ఆటగాడి బట్టతలపై బంతిని రుద్ది షైన్ చేయడం చూడవచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాక్ ఇన్నింగ్స్ సమయంలో 72 ఓవర్ లో తమ స్పిన్నర్ జాక్ లీచ్ దగ్గరికి పిలిచిన జో రూట్.. అతని బట్టతలపై చెమటను ఉపయోగించి బంతిని షైన్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా అందరూ ఇది చూసి నవ్వుకుంటున్నారు. వావ్ ఇలాంటి టెక్నిక్ ఇన్నాళ్లు మాకు తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: