గ్లాడియేటర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రియాజ్ , వసీం, ఇఫ్తికార్ అహ్మద్ , తుషారా మరియు ప్రదీప్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ను స్టార్ట్ చేసిన గ్లాడియేటర్స్ పవర్ ప్లే లో ఓవర్ కు పది రన్ చొప్పున స్కోర్ చేసి త్వరగానే మ్యాచ్ ను ముగిస్తారు అనుకున్నారు అంతా , కానీ పవర్ ప్లే తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మరో ఎండ్ లో కుషాల్ మెండిస్ ఉండగానే వరుసగా ప్రధాన ఆటగాళ్లు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరికి మెండిస్ సైతం 51 పరుగుల వద్ద అవుట్ అయ్యి గ్లాడియేటర్స్ ఓటమిని ఖరారు చేశాడు.
అద్భుతంగా బౌలింగ్ చేసిన జఫ్నా కింగ్స్ మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకున్నారు. బినూర ఫెర్నాండో 3 వికెట్లు మరియు వియస్కాంత్ 2 వికెట్లు తీసి ఓటమి దెబ్బ కొట్టారు. చేతులారా మ్యాచ్ ను మెండిస్ సేన పోగొట్టుకుంది. నిజంగా ఇది గ్లాడియేటర్స్ కు మంచి ఆరంభం కాదని చెప్పాలి.