ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ గాయపడిన నేపథ్యంలో ఒక సీనియర్ బౌలర్ కి అదృష్టం వరించింది అన్నది తెలుస్తుంది. ఎన్నో రోజులుగా టీమిండియాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీనియర్ బౌలర్ జయదేవ్ ఉన్నాద్గత్ కు ప్రస్తుతం భారత జట్టులోకి పిలుపు వచ్చింది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులోకి వచ్చే జయదేవ్ బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం మహమ్మద్ షమీ స్థానంలో టీమ్ ఇండియాలో ఆడబోతున్నాడు. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది అని చెప్పాలి.
చేతికి గాయం అయిన కారణంగా మహమ్మద్ షమీ ఇటీవల సిరీస్ నుంచి వైదొలిగాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే 2010లో భారత జట్టులోకి అరేంగేట్రం చేసిన 31 ఏళ్ల జయదేవ్ ఆ ఏడాది కేవలం రెండు టెస్ట్ మ్యాచ్ లలో మాత్రమే ఆడాడు ఇక తర్వాత ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు అని చెప్పాలి. ఏడు వన్డే మ్యాచ్లు, పది టి20లలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు ఇటీవల విజయ్ హాజారే ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ జట్టులోకి వచ్చాడు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అతను ఎలా వినియోగించుకోబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి