టి20 ఫార్మాట్ లో గత కొంతకాలం నుంచి ఒక పేరు మారుమోగిపోతుంది అదే సూర్య కుమార్ యాదవ్. ప్రస్తుతం టి20 ఫార్మాట్ కోసమే సూర్య కుమార్ యాదవ్ పుట్టాడేమో అన్న విధంగా తన బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఏ బౌలర్ వేసిన బంతి ఎక్కడ వేసిన సిక్సర్లు దంచి కొడుతున్నాడు. ఇక ఇప్పటివరకు క్రికెట్ ప్రేక్షకులు ఎరుగని వినూత్నమైన షాట్లతో ఎంతోమందిని అలరిస్తూ ఉన్నాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే అతని స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువగానే ఉండడం గమనార్హం. అయితే కేవలం టి20 ఫార్మాట్లోనే కాదండోయ్ వన్డే  ఫార్మాట్లో కూడా సూర్య కుమార్ యాదవ్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 దీంతో  త్వరలోనే అతను టెస్టు ల్లోకి అరంగేట్రం చేస్తాడని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీ20 వన్డే ఫార్మాట్ల లో తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇస్తాడా అని అటు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మైదానం లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో దూకుడుగా ఆడే సూర్య కుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్కు సరిపోతాడా అని కూడా కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం పూజార, కోహ్లీ, శ్రేయస్ లతో మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ పటిష్టం గానే కనిపిస్తుంది. ఒకవేళ సూర్య కుమార్ జట్టు లోకి వస్తే అతని ఏ స్థానంలో ఆడిస్తారు అన్నది ఆసక్తికరం గా మారి పోయింది. ఇప్పుడు రంజి ట్రోఫీ లో కూడా సూర్యకుమార్ అదరగొడుతున్నాడని చెప్పాలి. దీంతో ఇక సూర్య కుమార్ టెస్ట్ ఫార్మాట్ ఎంట్రీ కి సమయం ఆసన్నమైందని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: