
ఈ క్రమంలోనే బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన తర్వాత కొత్త సెలక్షన్ కమిటీని ఇప్పటివరకు ఎంపిక చేయకపోవడం మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది అని చెప్పాలి. అయితే కొత్త సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులను ఆహ్వానించడం స్వీకరించడం కూడా ముగిసింది. అయితే ఈ ప్రక్రియ ముగిసి దాదాపు నెల రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటివరకు కొత్త సెలక్షన్ కమిటీ నియామకం ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొత్త ఏడాదిలో కొత్త జట్టును కొత్త సెలక్షన్ కమిటీ ఎన్నుకొంటుందని అందరూ అనుకున్నారు.
ఇక కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరగబోయే వన్డే, టి20 సిరీస్ లకు సంబంధించిన జట్టు ఎంపిక కూడా రద్దయిన చేతన్ శర్మ కమిటీని పూర్తి చేసింది అని చెప్పాలి. దీంతో కొత్త కమిటీ ఎప్పుడు వస్తుందని ప్రశ్నలకు సమాధానం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమాధానం తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అన్నది ప్రస్తుతం ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే క్రికెట్ సలహా కమిటీ సభ్యులు అశోక్ మలహోత్ర, సులక్షణ నాయక్ సహా మరి కొంత మంది 29వ తేదీన ప్రత్యేకంగా సమావేశమై సెలక్షన్ కమిటీ ప్యానెల్ గురించి ఇక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక కొత్త సెలక్షన్ కమిటీ విషయం ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అన్నది చూడాలి మరి.