
అలాంటి వారిలో క్రిస్టియానో రోనాల్డో కూడా ఒకరు అని చెప్పాలి. ఫుట్బాల్ ఆటలో క్రిస్టియానో రోనాల్డో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు . ఏకంగా తమ దేశపు జట్టు తరఫున ఆడక పోయినప్పటికీ అతను బాగా ఆడాలని కోరుకునే అభిమానులు కోట్లల్లోనే ఉంటారు అని చెప్పాలి.
అయితే ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా పోర్చుగల్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిస్టియనో రోనాల్డో తన జట్టుకు వరల్డ్ కప్ అందించడానికి తీవ్రంగా శ్రమించాడు. కానీ ఊహించని రీతిలో సెమీఫైనల్ లోనే పోర్చుగల్ జట్టు ఓడిపోయి ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం క్రితం మాంచేస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ తో క్రిస్టియానో రోనాల్డో కి గొడుగవలు జరగ్గా.. దీంతో మంచేస్టర్ యునైటెడ్ తో పూర్తిగా తెగ తెంపులు చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియనో రోనాల్డో ఇకపై సౌదీ లీగ్ కు ఆడనున్నాడు అన్నది తెలుస్తుంది. 2023- 25 మధ్య ఆల్ నజర్ టీంకు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రపంచకప్ తర్వాత మళ్లీ రోనాల్డోని గ్రౌండ్లో చూసేందుకు ఛాన్స్ రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి.