టాలీవుడ్ లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తన సినిమాలతో తన పేరు మొత్తం కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగిపోయేలా చేసుకున్నాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆయన ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూసేలా తన సినిమాలతో ప్రభావితం చేశాడు. శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా ఎపిసోడ్ డైరెక్టర్గా కెరియర్ ని మొదలుపెట్టిన రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో వెండితెరపై దర్శకుడిగా మారిపోయాడు.



 ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే రాజమౌళి కేవలం దర్శకత్వం వహించడమే కాదు తన సినిమాలలో అవసరమైతే కొన్ని కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో కూడా నటిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు రాజమౌళి దర్శకుడిగా నటుడిగా మాత్రమే అలరించాడు అన్న విషయం ప్రేక్షకులకు తెలుసు. కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాజమౌళి ఒక స్టార్ హీరోకి తన గాత్రాన్ని అందించారు అన్న విషయం చాలామందికి తెలియదు.


 ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్ కావడం గమనార్హం. ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమాలలో చత్రపతి కూడా ఒకటి. ఈ సినిమాకు  రాజమౌళి దర్శకుడు. ఇదే సినిమాని ప్రస్తుతం బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే చత్రపతి సినిమాకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదట. ఆ సమయంలో ప్రభాస్ అందుబాటులో లేకపోవడం వల్ల డబ్బింగ్ ఆలస్యమైంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రాజమౌళి ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పేసాడట. ఇక సినిమాలో ఎంతలా గమనించిన ఈ విషయం ఎవరికీ అర్థం కాదు అని చెప్పాలి. జక్కన్న ఇలా డబ్బింగ్ లో కూడా ఎంత పర్ఫెక్ట్ గాఉంటాడో అన్న  విషయం తెలిసి ఫాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: