భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టుతో భాగ్యనగరం వేదికగా మొదటి వన్డే మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్ హోరాహోరీగా జరిగింది అని చెప్పాలి. మొదట భారత బ్యాట్స్మెన్ లు చెలరేగి  పోవడంతో 349 పరుగుల భారీ స్కోరు చేసింది టీమ్ ఇండియా. దీంతో ఎంతో అలవోకగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. ఇక తర్వాత బౌలింగ్ విభాగం కూడా పట్టు బిగించడంతో తక్కువ పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది న్యూజిలాండ్ జట్టు.


 దీంతో ఇక టీమ్ ఇండియాకు విజయం ఖాయం అయినట్లే అని అందరూ భావించారు.  ఇలాంటి సమయంలో ఇలాంటి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బ్రెస్ వెల్ ఓటమి భయం ఎలా ఉంటుందో టీమిండియా కు పరిచయం చేశాడు.  కానీ చివరికి 12 పరుగులు తేడాతో టీమిండియా గెలిచింది అని చెప్పాలి. ఇక అదే జోరుతో నేడు రెండో వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీం ఇండియా. ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియాకు గట్టి దెబ్బ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసిసి ఇటీవల తెలిపింది.


 కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇక స్లో ఓవర్ రేట్ జరిగింది అన్న విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో విచారణ అవసరం లేకుండానే ఇక టీమిండియా జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.  ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ సమయం లోగా టీమిండియా మూడు ఓవర్లు తక్కువ వేసిందట. దీంతో స్లో ఓవర్ రేటుగా పరిగణించిన  ఐసీసీ ఇక  మూడు ఓవర్ల చొప్పున ఒక్కో ఓవర్ కు 20 శాతం కింద మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు పేర్కొంది. ఇలా మ్యాచ్ గెలిచి సంతోషంలో ఉన్న టీమ్ ఇండియాకు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: