టీమ్ ఇండియాలో  స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ వివాహం ఇటీవల ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందె. ఎన్నో రోజుల నుంచి కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు అయినా సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో ప్రేమలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక వీరి ప్రేమకు సంబంధించి గతంలో వార్తలు రాగా.. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. కాగా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది అని చెప్పాలి.


 ఇక కేఎల్ రాహుల్ మామ సునీల్ శెట్టి ఖర్చు విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. అంతేకాదు ఇక పెళ్లి  రాహుల్ ఇల్లు లైట్లతో మెరిసిపోతూ ఉండడం ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఆతియాశెట్టి కేఎల్ రాహుల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయ్. అదే సమయంలో ఇక ఈ స్టార్ క్రికెటర్ పెళ్లికి ఎలాంటి కాస్ట్లీ గిఫ్టులు వచ్చాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ముఖ్యంగా ఇక కేఎల్ రాహుల్ సహచరులు టీమిండియా స్టార్ ప్లేయర్ల నుంచి ఎలాంటి కాస్లి గిఫ్టులు వచ్చాయో తెలుసుకోవాలని అభిమానులందరూ ఆసక్తి చూపుతున్నారు. కాగా రాహుల్ సహచరుడు అయిన విరాట్ కోహ్లీ ఒక కాస్లి గిఫ్ట్ ను ఇచ్చి సర్ ప్రైస్ చేశాడట. 2.17 కోట్ల విలువైన బిఎండబ్ల్యూ కారుని బహుమతిగా ఇచ్చాడట కోహ్లీ. మహేంద్ర సింగ్ ధోని సైతం 80 లక్షల విలువ చేసే ఒక కవసాకి నింజా బైక్ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. సునీల్ శెట్టి తరపున వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలాంటి కాస్లి గిఫ్ట్ లు ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: