ఇటీవల ఆస్ట్రేలియా భారత్ మధ్య నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 132 పరుగుల తేడాతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది టీమిండియా. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కనబరిచిన టీమ్ ఇండియా జట్టు తిరుగులేని ప్రదర్శన చేసింది అని చెప్పాలి.. ఇక మొదట బ్యాటింగ్ చేసిన కంగారుల జట్టు తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో 91 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది.


 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో అటు తన స్పిన్ బౌలింగ్ తో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి.  కీలకమైన వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియా నడ్డి విడిచాడు. అయితే ఇక మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు అచ్చం అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియాతో అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. అయినప్పటికీ ఇక అధికారిక మ్యాచ్లో మాత్రం అశ్విన్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఆస్ట్రేలియా జట్టుకు చురకలు అంటించాడు.


 ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పుడు నిజమైన అశ్విన్ కు డూప్లికేట్ అశ్విన్ కు తేడా తెలిసింది అని అనుకుంటున్నాను అంటూ మహమ్మద్ కైఫ్ సెటైర్ వేశాడు. యువ ఫస్ట్ క్లాస్ బౌలర్ ను ఎదుర్కోవడం ద్వారా ఆల్ టైం గ్రేట్ లో ఒకరిని ఎదుర్కోవడానికి మీరు ఎప్పటికీ సిద్ధం కాలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఢిల్లీ వేదికగా జరగబోయే రెండవ టెస్ట్ కి ఇక జడేజా లాంటి డూప్లికేట్ కోసం ఆస్ట్రేలియా వెతకదు అని అనుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశాడు. అయితే ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో జడేజా సైతం బ్యాటింగ్లో బౌలింగ్లో అదరగొట్టాడు. ఇక అశ్విన్ ను ఎదుర్కోవడానికి యువ ఆటగాడిని నియమించుకున్నట్లుగానే జడేజా కోసం కూడా మరో డూప్లికేట్ ను వెతుకుతారనే ఉద్దేశంతో సెటైర్లు వేశాడు మహమ్మద్ కైఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: