అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు అటు మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆస్ట్రేలియాకు మూడవ టెస్టులో విజయం సాధించడం ఎంతో కీలకం. అయితే ఇక మూడవ టెస్ట్ కు ముందు మాత్రం ఆస్ట్రేలియాకు ఊహించని షాకులు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ వ్యక్తిగత కారణాలవల్ల స్వదేశానికి పయనమయ్యాడు. ఇక గాయంతో పలువురు ఆటగాళ్లు కూడా దూరమయ్యారు.ఇక స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సమయంతో సిరీస్ మొత్తానికి దూరమై.. స్వదేశానికి ప్రయాణం అయ్యాడు అన్నది తెలుస్తుంది.
ఇక ఇప్పుడు మరో ఆస్ట్రేలియా ప్లేయర్స్ సైతం ఇంటి బాట పడుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన స్పిన్నర్గా కొనసాగుతున్న అస్టన్ అగర్ ను టెస్టు సిరీస్ నుంచి రిలీజ్ చేయడంతో ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే అగర్ స్వదేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నట్లు.. ఆ దేశ సెలెక్టర్ టోనీ డుడే మైడ్ ధ్రువీకరించాడు. కాగా ఇప్పటికే హేజిల్ వుడ్ లాంటి కీలకమైన ప్లేయర్ సైతం అటు జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సరైన ప్రదర్శన చేయలేకపోయిన ఆస్ట్రేలియా.. కీలక ప్లేయర్లు లేకుండా ఎలా టీమిండియాను ఎదుర్కొంటుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి