ఇక నటనకు నాగేశ్వరరావు నిలువెత్తు రూపం అని ఆయన అభిమానులు కూడా చెబుతూ ఉంటారు. ఇక ఆయన కెరియర్ లో చేయని పాత్ర అంటూ లేదు అని చెప్పాలి. సాంఘిక పౌరాణిక జానపదం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జోనర్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో సూపర్ హిట్ లు అందుకున్నాడు అక్కినేని నాగేశ్వరరావు. అయితే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ఇక వరుసగా రెండు సినిమాలతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు అని చెప్పాలి. అక్కినేని నటించిన బాలరాజు 1948లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఏడాది ఆయన నుంచి వచ్చిన కీలుగుర్రం సినిమా సైతం ఇక అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది.
అయితే ప్రభాస్ కెరియర్లో సైతం ఇక ఇలా ఇండస్ట్రీలో ఉన్న అన్ని సినిమాల రికార్డులను తిరగరాసి సరికొత్త ప్రభంజనం సృష్టించిన రెండు సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. అవేంటో కాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు. బాహుబలి ది బిగినింగ్ సినిమాతో 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్టు కొట్టి అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ సినిమా తెలుగు జాతిఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక ఆ తర్వాత 2017లో బాహుబలి ది కంక్లూజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా క్రేజ్ సంపాదించాడు ప్రభాస్. ఇలా వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరోలు ఏఎన్నార్, ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం.