అయితే ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన భారత జట్టు ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. అదే సమయంలో మూడో మ్యాచ్లో గెలవడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలని ఆశపడుతుంది టీమిండియా. కాగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ఇండోర్ వేదికగా మార్చ్ ఒకటవ తేదీన ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే . కాగా ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలో కూడా స్పిన్ పిచ్ లలో స్పిన్నర్లే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగింది టీం ఇండియా జట్టు.
ఇక మూడో మ్యాచ్లో కూడా ఇక ఇదే వ్యూహాన్ని ఫాలో కావాలని టీమిండియా భావిస్తుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇండోర్ వేదికగా జరగబోయే మ్యాచ్ కోసం మళ్లీ స్పిన్ పిచ్ నే తయారు చేసినట్లు సమాచారం. ఇక ఈ పిచ్ పై స్వల్పంగా గడ్డి ఉండడంతో బ్యాటింగ్కు అనుకూలిస్తుందని పిచ్ క్యూరేటర్ తెలిపారు. అయితే చివరి రెండు రోజుల్లో మాత్రం స్పిన్ ఎక్కువగా టర్న్ అయ్యే అవకాశం ఉంది అని పిచ్ క్యూరేటర్ తెలిపారు. దీన్నిబట్టి ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా స్పిన్ పిచ్ ఉండడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎలా భారత బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి