ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ ముగిసాయ్. ఈ రెండు మ్యాచ్లలో కూడా అటు భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది అని చెప్పాలి. భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లను ఎంతో అద్భుతంగా వినియోగించుకున్న టీమిండియా అదరగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే సిరీస్లో రెండు సున్నా తేడాతో ఆదిత్యాన్ని సంపాదించింది. కాగా ప్రస్తుతం ఇండోర్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది.


 అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా జట్టు అటు మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తూ ఉంది. సిరీస్ కైవసం చేసుకుంది అంటే అటు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా బెర్తును ఖరారు చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇక భారత జట్టును ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాని మాత్రం కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ ఉండటం.. ఇక ఏకంగా కెప్టెన్ జట్టుతో లేకుండా స్వదేశానికి వెళ్లిపోవడం లాంటివి జరుగుతున్నాయి.


 అయితే మూడో టెస్టులో మాత్రం శుభారంభం చేసింది ఆస్ట్రేలియా జట్టు. మొదటి రెండు మ్యాచ్లలో భారత  స్పిన్ ఉచ్చులవ్ ఆస్ట్రేలియా పడిపోతే అటు మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా స్పిన్ ఉచ్చులో భారత జట్టు పడిపోయింది అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చేరడానికి భారత జట్టు మూడు టెస్ట్ మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. కానీ అటు టెస్ట్ ర్యాంకింగ్స్ లవ్ అగ్రస్థానానికి చేరుకోవాలంటే మాత్రం ఆస్ట్రేలియాను క్లీన్స్వీప్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఒకవేళ ఇదే జరిగితే ఆస్ట్రేలియా ఇక డబ్ల్యూటీసి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: