
అయితే ఇక బాబర్ తర్వాత పాకిస్తాన్ కి కెప్టెన్ గా కాబోయే ఆటగాడు ఎవరు అన్న విషయం చర్చకు రాగా.. పాకిస్తాన్లో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న షాదాబ్ ఖాన్ కే వైస్ కెప్టెన్సీ అప్పగిస్తూ సూత్రపాయంగా.. అతనే ఫ్యూచర్ కెప్టెన్ అన్న హింట్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఏ క్షణంలోనైనా షాదబ్ ఖాన్ కు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది అని కొంతమంది విశ్లేషకులు కూడా అంచనా వేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల షాదబ్ ఖాన్ ను పాకిస్తాన్ టి20 కెప్టెన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు.
గత కొంతకాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న బాబర్ కు విశ్రాంతిని ప్రకటించింది. ఇక ఆఫ్గనిస్తాన్తో జరగబోయే టి20 సీరిస్ కు పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు షాదబ్ ఖాన్. సిరీస్ లో మహమ్మద్ రిజ్వాన్, హరీష్ రావువ్, షాహిన్ ఆఫ్రిథిలు కూడా ఆడటం లేదు అని చెప్పాలి. ఇక వీళ్లు నలుగురు స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో జట్టులో కొత్త ఆటగాళ్ళకు ఛాన్స్ దక్కింది అని చెప్పాలి. అయితే షాదాబ్ ఖాన్ కు ఇక ఇప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా నియమించడంపై అటు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.