హైదరాబాద్ ద బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల కాలం లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఇక ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అని చెప్పాలి. వైవిద్యమైన బంతులను సంధిస్తూ కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా విజయంలో తనవంతు పాత్రను పోషిస్తూ.. ఇక జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇలా హైదరాబాద్ కి బౌలర్ మహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాలో అంచలంచలుగా ఎదుగుతున్న తీరు చూసి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. అయితే ఇటీవల అద్భుతమైన ఫామ్ కనబరిచిన మహమ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటాడు. ఏకంగా వన్డే ఫార్మాట్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. అయితే సిరాజ్ కు వన్డే ఫార్మట్ టాప్ ర్యాంక్ వారం రోజుల ముచ్చట అన్నది తెలుస్తుంది.



 ఎందుకంటే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఫార్మాట్లో టాప్ ఫామ్ కనబరచకపోవడంతో ఇక ఒక్కసారిగా అగ్రస్థానం నుంచి మూడో స్థానంలోకి పడిపోయాడు సిరాజ్. ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ 713 పాయింట్లు తొలి స్థానంలో ఉండగా.. 708 పాయింట్లతో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండవ స్థానంలో ఉన్నారు. సిరాజ్ 702 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. మళ్ళీ అగ్ర స్థానంలోకి రావాలని ఫ్యాన్స్ బలంగా కోలుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే  సిరీస్లో తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా  తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా సిరీస్ చేజార్చుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: