
ఈ క్రమంలోనే ప్రారంభోత్సవ వేడుకలు లేకుండానే ఇక రిచెస్ట్ లీగ్ గా కొనసాగుతున్న ఐపీఎల్ సాదాసీదా గానే ప్రారంభం అవుతూ వస్తుంది. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నేపథంలో ప్రారంభ వేడుకలు నిర్వహించలేదు. కానీ ఇక ముగింపు వేడుకలను మాత్రం నిర్వహించింది బీసీసీఐ. అయితే ఇక ఇప్పుడు కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోవడం భారత్ లో ఉన్న అన్ని వేదికలపై కూడా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. అదే సమయంలో ఇక ప్రారంభ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.
దీంతో గత మూడేళ్ల నుంచి ఐపీఎల్ ప్రారంభోత్సవాలు నిర్వహించిన బీసీసీఐ ఈసారి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది అన్నది తెలుస్తుంది. ఈ నెల 31వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సినీ సెలబ్రిటీలతో ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరగబోతున్నాయట. రష్మిక, తమన్నాలు ప్రత్యేకంగా డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే 2018లో హృతిక్ రోషన్, జాక్వెలిన్, వరుణ్ ధావన్, పరిణితి చోప్రా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ప్రదర్శన చేశారు. బీసీసీఐ ఇక ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న వార్త వైరల్ గా మారిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు అని చెప్పాలి.