
ఇలా అంతర్జాతీయ మ్యాచ్లలో గాయపడుతున్న ప్లేయర్లు కొంతమంది కొన్ని మ్యాచ్లకు దూరం అవుతుంటే.. మరి కొంతమంది ఇక ఐపీఎల్ టోర్నీ మొత్తానికి కూడా అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఇక గాయం తీవ్రత ఎక్కువగా లేని ఆటగాళ్ళను అటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు టోర్నీలో ఆడించే అవకాశం ఉంది అంటూ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి భారత కెప్టెన్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.
అయితే విదేశీ ఆటగాళ్లు మాత్రమే కాదు భారత్కు చెందిన పలువురు ప్లేయర్లు కూడా గాయాల బారిన పడి ఐపిఎల్ టోర్నీకి దూరమయ్యారు. అయితే గాయం తీవ్రం కాకుంటే వారిని ఐపీఎల్ ఆడించాలని ఆలోచనలో ఫ్రాంచైజీలు ఉండగా.. గాయాల పాలైన ఆటగాడిని అటు ఐపిఎల్ లో ఆడిస్తే గాయం తిరగబెట్టి కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది అంటూ రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉందని దానిని దృష్టిలో పెట్టుకుని ఆయా జట్ల యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకోవాలి అంటూ సూచించాడు.