మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 లో చివరి రోజుకు చేరుకున్నాము. 20 రోజుల పాటు అయిదు జట్లు ప్రేక్షకులకు కనులకు వీనులవిందును క్రికెట్ ద్వారా పంచారు. రేపు సాయంత్రం ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన హోరా హోరీగా జరగనుంది. లీగ్ స్టేజ్ లో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు డైరెక్ట్ గా ఫైనల్ చేరడంతో , రెండు మూడు స్థానాలలో ఉన్న ముంబై మరియు యూపీ వారియర్స్ జట్లు నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడ్డాయి. లీగ్ లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా మ్యాచ్ లో బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అలా ముంబై మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవంగా మొదటి పది ఓవర్ ల వరకు చాల నెమ్మదిగా ఇన్నింగ్స్ సాగినా, ఆ తర్వాత ముంబై ప్లేయర్స్ గేర్ మార్చి స్కోర్ ను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నటాలీ సీవర్ కేవలం 38 బంతుల్లోనే 72 పరుగులు చేసి జట్టు ఈ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో మొత్తం 9 ఫోర్లు మరియు 2 సిక్సులు ఉన్నాయి. ఇందులో అమేలియా ఖర్ 29 మరియు పూజ 11  లు తలో చెయ్యి వేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. ఓపెనర్లు హీలీ (11) మరియు శ్వేతా (1)లు విఫలం కావడంతో ముంబై పని చాలా సులభం అయింది. టీం అంతా ఈ స్కోర్ ను ఛేదించడంలో ఫెయిల్ అయింది. తాలియా మెక్ గ్రాత్ (7), హరీష్ (14), దీప్తి (16), సిమ్రాన్ (0), ఎక్లస్టన్ (0), అంజలి సర్వాణి (5) మరియు రాజేశ్వరి గయక్వాడ్ (5) లు తక్కువ స్కోర్ లకే అవుట్ అయ్యారు. కానీ కిరణ్ నవగిరే మాత్రం 4 ఫోర్లు, 3 సిక్సులు సహాయంతో 43 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో వామ్గ్ 4 , సైకా ఇషాక్ 2 వికెట్లు తీసి యూపీ వారియర్స్ పతనాన్ని శాసించారు. అలా ముంబై ఫైనల్ కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: