గత ఏడాది చివర్లో జరిగిన 2023 ఐపీఎల్ సీజన్ కి సంబంధించిన మినీ వేలం లో ప్రేక్షకుల అంచనాలు మరో సారి తారుమారు అయ్యాయి అన్న విషయం తెలిసిందే. జట్లు తమతోనే అంటిపెట్టుకుంటాయి అన్న ఆటగాళ్లను సైతం వేలం లోకి వదిలేసాయి ఫ్రాంచైజీలు. దీంతో ఇక ఎంతో మంది సీనియర్ స్టార్ ప్లేయర్లు సైతం వేలంలో పాల్గొన్నారు. అయితే అనుభవం ఉన్న సీనియర్లను కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయని అందరూ భావించారు. కానీ ఊహించని రీతి లో మళ్ళీ యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేసాయి అన్ని ఫ్రాంచైజీలు.


 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గతంలో ఎలా అయితే అటు డేవిడ్ వార్నర్ ని మెగా వేలంలోకి వదిలేసి అభిమానులందరికీ షాక్ ఇచ్చిందో.. ఇక గత ఏడాది చివర్లో జరిగిన మెనీ వేలంలో కూడా ఇలాంటి ట్రిస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. డేవిడ్ వార్నర్ తర్వాత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను భుజాన వేసుకొని టీం ను ముందుకు నడిపిస్తున్న.. సీనియర్ కేన్ విలియమ్సన్ను మినీ వేలంలోకి వదిలేసింది. మళ్లీ కొనుగోలు చేస్తుంది అనుకున్నప్పటికీ అసలు అతన్ని కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఎంతో తెలివిగా వ్యవహరించిన గుజరాత్ టైటాన్స్ రెండు కోట్ల రూపాయలకు విలియమ్సన్ ను  దక్కించుకుంది.


 గత 8 ఏళ్లుగా  సన్రైజర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన కేన్ విలియంసన్.. ఇక ఈ ఏడాది నుంచి గుజరాత్ టైటాన్స్ కు ఆడబోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు విలియంసన్. సన్రైజర్స్ తో చాలా సీజన్లో అద్భుతంగా గడిచాయి. ఆటగాళ్లు వివిధ జట్లకు మారుతుండడం సహజంగా జరిగేది. హార్థిక్ కెప్టెన్సీ లోని గుజరాత్ జట్టుతో ఆడనుండడం మాత్రం ఉద్వేగంగా ఉంది అని కేన్ విలియమ్సన్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: