ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన అదిరిపోయే ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అతను ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు ఒక సిక్స్ ఆర్ ఉండడం గమనార్హం. అయితే అతను తప్పకుండా సెంచరీ చేస్తాడు అని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. అయితే మరో ఎండ్ లో ఉన్న మహేంద్ర సింగ్ ధోని జట్టు భారీ స్కోర్ చేరుకోవడంలో గణనీయమైన సహకారం అందించాడు అని చెప్పాలి. అయితే టి20 హిస్టరీలో ఇప్పటివరకు 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.
కానీ 5000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో డేవాన్ కాన్వే సగటు మాత్రం అందరికంటే అత్యుత్తమంగా ఉండడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడే ఈ బ్యాటర్ ఇప్పటివరకు టి20 ఫార్మాట్లో 44.41 సగటుతో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే దేవాన్ కాన్వే తర్వాతే అటు బాబర్ అజం, విరాట్ కోహ్లీలు ఉన్నారు. బాబర్ టీ20 లో 44.02 సగటుతో 5000 పరుగులు సాధించాడు. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 43.95 సగటు, భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 42.31 సగటు,విరాట్ కోహ్లీ 41.04 సగటుతో 5000 పరుగులు సాధించారు.ఇలా 5000 పరుగులు చేయడానికి అత్యధిక సగటు నమోదు చేసిన ప్లేయర్గా డేవాన్ కాన్వే రికార్డు సృష్టించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి