పదహారేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ప్రతిసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఇక లీగ్ దశతోనే సరిపెట్టుకుంటూ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్న టీం ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. ఈ టీం కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ చాంపియన్ టీం రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ టీంలో ఉన్న స్టార్ ప్లేయర్స్ కూడా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతం ఆటగాళ్లే కావడం గమనార్హం. ఇక అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లు ఇక జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్న అటు ఆర్సిబిని మాత్రం దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది.



 ఇక 2023 ఐపీఎల్ సీజన్ లోను ఇదే రిపీట్ అయింది. మొదటినుంచి ఎంతో పటిష్టంగా కనిపిస్తూ వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కీలకమైన మ్యాచ్లలో మాత్రం గెలవలేకపోయింది. ఇక ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ సమయంలో ప్లే ఆఫ్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చివరికి ఓడిపోయింది. విరాట్ కోహ్లీ సెంచరీ తో చేలరేగిపోయిన మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో చివరికి ఓటమి తప్పలేదు. దీంతో ఇక బెంగళూరు జట్టు అభిమానులందరికీ కప్పు గెలవాలని కల కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఆర్సిబికి కప్పు గెలిచే అదృష్టం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. అంతేకాదు బెంగళూరు కెప్టెన్ గా ఉన్న డూప్లెసెస్ ఆర్సిబి ఓడిపోతుందని ముందుగానే చెప్పాడు అంటూ ఒక వీడియో ప్రస్తుతం ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సిబి కెప్టెన్  డూప్లెసెస్, విరాట్ కోహ్లీ తో ఒక కార్యక్రమం నిర్వహించగా.. ఈసారి కప్పు నమ్దే అనాల్సింది పోయి ఈ ఏడాది కప్పు లేదు.. ఈ సాల కప్పు నహి అంటూ ఉచ్చరించాడు డూప్లెసెస్. ఇక చివరికి ఇదే నిజం అయ్యింది అంటూ మిగతా టీమ్స్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl