
అయితే ఇప్పటికే మొదటి క్వాలిఫైయర్ లో విజయం సాధించి ఫైనల్లో అడిగి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఎవరు తమకు ప్రత్యర్థిగా ఫైనల్ లో ఆడబోతున్నారు అనే విషయం పైకి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్ అటు గుజరాత్ జట్టుకి హోం గ్రౌండ్ అయిన ఆత్మదాబాద్ లో జరుగుతూ ఉండడంతో ఆ జట్టుకు ప్రతికూల అంశమే అని చెప్పాలి. అదే సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా ఇప్పుడు ఏదైనా సాధ్యమే అన్నది తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఇక నేడు జరగబోయే మ్యాచ్లో ఎవరు విజేతగా నిలిచి ఫైనల్లోకి అడుగు పెడతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే లీగ్ దశ పాయింట్స్ పట్టికలో టాప్ లేపిన గుజరాత్ టైటాన్స్ చివరకు తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఐదు సార్లు విజేత అయిన ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటుంది. ఇరు జట్ల బలాబలాలు కూడా ఒకరికి మించి ఇంకొకరు అనే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఈ ఉత్కంఠ భరితమైన పోరు కోసం అటు అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.