సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో వన్డే టి20 ఫార్మాట్ లాంటి పరిమిత ఓవర్ల ఫార్మాట్లు ఉన్న.. ఎక్కువ మంది ప్లేయర్లు ఇష్టపడేది మాత్రం సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకుని టెస్ట్ ఫార్మాట్ నే అనే విషయం తెలిసిందే. ఇక టెస్ట్ ఫార్మాట్లో ఎప్పుడూ అత్యుత్తమమైన ప్రదర్శన చేసి అరుదైన రికార్డులు సృష్టించాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు ఎంతమంది స్టార్ ప్లేయర్స్. ఈ క్రమంలోనే ఇలా రికార్డులు సృష్టించడం విషయంలో కొంతమంది సక్సెస్ అయితే ఇక మరికొంతమంది మాత్రం ఇక అభిమానులందరినీ కూడా నిరాశపరచడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే టెస్ట్ క్రికెట్లో ఎవరైనా ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసే రికార్డు సృష్టించాడు అంటే చాలు అదే అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 అయితే టెస్ట్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఎంతో ఆచీ తూచి బ్యాటింగ్ చేయడం చూస్తూ ఉంటాం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో లాగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవడం కాదు.. ముందుగా వికెట్ను కాపాడుకొని సింగిల్ తీసిన సరిపోతుంది అనే మైండ్ సెట్ తో ఉంటారు అని చెప్పాలి. దీంతో ఇక ఆటగాళ్లు ఎంతో ఓపికగా క్రీజులో పాతుకుపోతూ ఉండడం అటు బౌలర్లకు తలనొప్పిని తెచ్చి పెడుతూ ఉంటుంది. అయితే ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేయడం.. అటు టెస్ట్ ఫార్మాట్లో చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ మాత్రం బస్ బాల్ విధానం ద్వారా టెస్ట్ క్రికెట్లో సైతం పరిమిత ఓవర్ల ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తూ ఉండడం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఇలాంటి దూకుడైన ఆటతీరుతోనే.. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో ఒక అరుదైన రికార్డులు నెలకొల్పాడు. లార్డ్స్ మైదానం వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో బెన్ డకెట్ 178 బంతుల్లో 24 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 182 పరుగులు చేశాడు. దీంతో 93 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్  బ్రాడ్మన్ సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో బ్రాడ్మన్ అత్యంత వేగంగా 150 రన్స్ చేసిన రికార్డును ఇక ఇప్పుడు బెన్ డకేట్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. అయితే ఇలా లార్డ్స్ మైదానంలో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల లిస్టు చూసుకుంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తర్వాత స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: