WTC (వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌) ఫైనల్‌ 2023 ఇంకో 2 రోజుల్లో విజయవంతం గా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యం లో ఇప్పటి వరకు ఎన్ని ఐసీసీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి? అందులో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా ఎన్ని ఫైనల్స్‌ వేర్వేరుగా ఆడాయి, ఎన్ని ఫైనల్స్‌ కలిసి ఆడాయి, వాటిలో భారత్‌ ఎన్ని సార్లు విజయం సాధించింది, ఆస్ట్రేలియా ఎన్ని సార్లు గెలిచింది? వంటి విషయాలను ఒకసారి పరిశీలిస్తే... మనకు చాలా ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అనేది చాలా ఉత్సుకతతో ముందుకు సాగింది. బరిలోకి దిగిన జట్లు నువ్వా, నేనా అన్నట్టు తలబడ్డాయి.

ఇంకో రెండు రోజుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరంభం కావడం తో యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ఫైనల్ పోరు లో పోటీ పడబోయే టీమ్‌ఇండియా - ఆస్ట్రేలియా జట్లు మాత్రం చాలా ఉత్సాహంగా సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ICC (ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగిన విషయం అందరికీ తెలిసినదే. వన్డే వరల్డ్‌కప్‌ (12), డబ్ల్యూటీసీ (1), టీ20 వరల్డ్‌కప్‌ (8), ఛాంపియన్స్‌ ట్రోఫీ (8) జరిగాయి.

అందులో టీమ్ఇండియా 10 ఫైనల్ మ్యాచులు ఆడి.. ఐదింటిలో మాత్రమే విజయం సాధించగా ఆస్ట్రేలియా 11 ఫైనల్స్లో బరిలోకి దిగి.. ఏకంగా 5 విజయాలను తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. ఇక ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారో అన్న విషయానికొస్తే, 1983 వన్డే వరల్డ్‌కప్‌లో విండీస్‌పై టీమ్ఇండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. తరువాత 2000 ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై భారత్‌ ఓటమిని చవిచూసింది. ఇక 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీలో శ్రీలంకతో పాటు సంయుక్తంగా విజేతగా నిలిచింది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: