
ఎందుకంటే ఒకవైపు ఆస్ట్రేలియా ఇక మరోవైపు టీమిండియా కూడా ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి. అయితే అటు టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్కు చేరుకుంది. దీంతో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసే అనుభవం ఉంది. అయితే మొదటిసారి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరుకున్నప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది . అంతేకాకుండా ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఎంతోమంది ప్లేయర్స్ ని అరుదైన రికార్డులు కూడా ఊరిస్తున్నాయి అని చెప్పాలి.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, రికార్డుల కింగ్ గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీని డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ లో భారత్ తరఫున సచిన్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. సచిన్ ఐసీసీ ఫైనల్స్ లో 657 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ మరో 37 పరుగులు చేస్తే ఈ రికార్డు బద్దలవుతుంది అని చెప్పాలి. అలాగే ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 3630 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు.. వివిఎస్ లక్ష్మణ్ 2434, రాహుల్ ద్రవిడ్ 2166 పరుగులు చేసి ఉండగా కోహ్లీ మరో 188 పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ్ ను వెనక్కి నెట్టేస్తాడు.