
ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న వారి కంటే అటు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకే ఎక్కువ క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. అయితే తన అద్భుతమైన కెప్టెన్సీ ప్రతిభతో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని 2023 ఐపీఎల్ సీజన్లో అటు ఛాంపియన్గా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మొన్నటి వరకు రిటైర్మెంట్ ఊహగానాలతో వార్తల్లో నిలిచిన ధోని.. ఇక ఇప్పుడు మరో విషయంతో న్యూస్ లో ట్రెండింగ్ గా మారిపోయాడు. మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ద్వారా ఆయన లైఫ్ లో ఉన్న వ్యక్తులు ఎవరు అన్న విషయం గురించి అందరికీ ఒక క్లారిటీ ఉంది.
కానీ ఇప్పుడు ధోని లైఫ్ లో ఎవరికీ తెలియని మరో వ్యక్తి ఉన్నాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన ఎవరో కాదు ధోని అన్నయ్య. ఫ్యాన్స్ ఫేస్బుక్ ద్వారా ధోని అన్నయ్యని గుర్తించారు. క్రికెట్ లెజెండ్ ధోని కంటే ఆయన అన్నయ్య పదేళ్లు పెద్దవాడు. సొంత రాష్ట్రంలో పొలిటీషియన్ గా ఉన్నాడు. ఆయన పేరు నరేంద్ర సింగ్ ధోని. 2013 నుంచి సమాజ్వాది పార్టీలో కొనసాగుతున్నాడు. అంతకు ముందు బిజెపిలో ఉండేవారు. అయితే ఈ విషయం తెలిసి మరి ధోని బయోపిక్ లో తన అన్నయ్య గురించి ఎందుకు పరిచయం చేయలేదు అన్న విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు