అయితే బౌలింగ్ విభాగం విషయంలో అటు టీమ్ ఇండియా సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ పెట్టుకొని జట్టులో కీ బౌలర్లను ఎందుకు పక్కన పెట్టారు అని అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో యంగ్ బౌలర్లకు ఎందుకు చాన్స్ ఇవ్వలేదని తిట్టిపోస్తున్నారు. వెస్టిండీస్ పర్యటన కోసం ఫుల్ ఫామ్ లో ఉన్న షమిని సెలెక్ట్ చేయలేదు. దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చారా పూర్తిగా ఉద్వాసన పలికార అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే మరికొన్ని రోజుల్లో బుమ్రా రానుండగా అతనితో కలిసి సిరాజ్, షమిలు ఫేస్ ఎటాకింగ్ బాధ్యతలను తీసుకుంటారని అందరూ అంచనా వేశారు. కానీ అంతకు ముందు బిసిసిఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 100 ప్రపంచ కప్ కి ముందు వన్డే ఫార్మాట్లో టీమిండియా 12 మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసి ఫైనల్ తర్వాత ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కూడా దొరికింది. ఇలాంటి సమయంలో కీలక బౌలర్ షమిని పక్కన పెట్టడం ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ప్లేయర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చి ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టడమే మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టీమిండియా కు నలుగురు సెలక్టర్లు శనిలా దాపరించారని వాళ్ళు ఉన్నంతవరకు.. కూడా వరల్డ్ కప్ టీమిండియా గెలవడం కష్టమే అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి