సాధారణంగా ప్రతి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తెరమీదకి వచ్చి ఇక క్రికెట్లో సూపర్ స్టార్ లుగా పేరు సంపాదించుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఇక 2023 ఐపీఎల్ సీజన్లోనూ ఇలాగే ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. కొంతమంది అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటే ఇంకొంతమంది కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి తమ సత్తా ఏంటో నిరూపించారు. ఇలా ఒక్క మ్యాచ్ తో ఐపీఎల్ లో హీరోగా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే.. అతను రింకు సింగ్ అని చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.


 గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో విజయానికి 31 పరుగులు కావాల్సిన సమయంలో ఇక అందరూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమి ఖాయం అని భావించారు. అలాంటి సమయంలో చివరి ఓవర్ లో ఐదు సిక్సర్లు బాధి ఇక జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు రింకు సింగ్. దీంతో ఇక ఐపీఎల్ ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా రింకు సింగ్ వైపు చూడటం మొదలుపెట్టారు. మాజీ ఆటగాళ్ళు అతని అద్భుతమైన ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు.


 అయితే కేవలం  గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లోనే కాదు ఆ తర్వాత మ్యాచ్లో కూడా చివర్లో మెరుపులు మెరిపించి  ఫినిషర్ పాత్రను పోషించాడు రింకు సింగ్  ఇక జట్టు గెలిచిన ఓడినా కూడా అతని వీరోచితమైన పోరాటం మాత్రం అభిమానులను మనసులు గెలుచుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను త్వరలోనే టీమిండియాలో జట్టులోకి రాబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇకపోతే రింగు సింగ్ గురించి కోల్కతా ఫ్రాంచైజీ  సహాయజమాని బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ ప్రశంస వర్షం కురిపించాడు. రింకు బచ్చా గురించి ఒక్క మాటలోచెప్పాలని సోషల్ మీడియాలో అభిమాని కోరగా.. రింకు బచ్చా కాదు బాబ్ అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: