అయితే ఇప్పుడు వరకు ఎంతోమంది ఆటగాళ్లు టీమిండియా కు కెప్టెన్సీ వహించినప్పటికీ.. ధోనీకి ఎక్కువ క్రేజ్ రావడానికి కారణం.. అతని యాటిట్యూడ్. ఒత్తిడి సమయాల్లో అందరూ కోపం చిరాకుతో ఊగిపోతూ ఉంటారు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఒత్తిడిని కూడా చిరునవ్వుతోనే జయిస్తూ ఉంటాడు. ఏకంగా వికెట్ల వెనకాల ఉండి ఎంతో ప్రశాంతంగా ఉంటూ.. మ్యాచ్ ని తన వైపుకు మలుపు తిప్పుకోగలడు. అందుకే అభిమానులు మహేంద్రసింగ్ ధోనిని మిస్టర్ కూల్ అని చెబుతూ ఉంటారు. ఇక అతనితో ఆడిన సహచరులు కూడా ఇలాగే చెబుతూ ఉంటారు అని చెప్పాలి.
కానీ ధోని కెప్టెన్సీ లో ఎన్నో ఏళ్ల పాటు టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన వెటరన్ ఫేసర్ ఇషాంత్ శర్మ మాత్రం ధోని గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని మిస్టర్ కూల్ కాదు ఎప్పుడూ ఆటగాళ్లను బూతులు తిడుతూ ఉంటాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ తో ఇషాంత్ శర్మ మాట్లాడుతూ ఈ వాక్యాలు చేసాడు. ఓ సారి నా బౌలింగ్ కోట పూర్తయింది. ఆ సమయంలో ధోని నా వద్దకు వచ్చి అలసిపోయావా అని అడిగాడు. అవును చాలా అలసిపోయాను అని చెప్పాను. దీంతో రిటైర్మెంట్ తీసుకో అని ధోని అన్నాడు.. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యా అంటూ ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఇషాంత్ వ్యాఖ్యలపై ధోని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి