అయితే ప్రస్తుతం టి20 ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ దృశ్య.. అటు ఎక్కడికక్కడ దేశీయ టి20 లీగ్ లు కూడా పుట్టుకొస్తున్నాయి. అటు ఎంతో మంది ప్లేయర్లు కూడా ఫ్రాంచైజీ క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇక ఆయా లీగ్లలో ఆడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా అటు ఎన్నో ఫ్రాంచైజీ యాజమాన్యాలు కోట్ల రూపాయలు గడిస్తూ ఉంటాయి.
అది సరేగాని ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. ఇటీవలే ఒక టీం కి ఫ్రాంచైజీ ఓనర్ గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాక్ కెప్టెన్ బాబర్ సారధిగా వ్యవహరిస్తున్న ముల్తాన్ సుల్తాన్ టీం ఓనర్ గా ఉన్న వ్యాపారవేత్త అలంజీర్ ఖాన్ తరీన్ (63) సూసైడ్ చేసుకున్నాడు. లాహోర్ లోనే గుల్బర్గ్లో ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ముల్తాన్ సుల్తాన్ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్నది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి