ప్రస్తుతం ఇండియన్ టీం లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు దేశం కోసం ఆడడం కంటే ఐ పీ ఎల్ ఆడదానికే ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఐ పీ ఎల్ ద్వారా వస్తున్నా డబ్బు వలన అందరికి అహంకారం పెరిగిందని, సీనియర్ ప్లేయర్ల సలహాలు తీసుకోవడం మానేశారని అన్నారు. ప్లేయర్స్ లో కాంఫిడెన్స్ ఉండటం మంచిదే కానీ ఓవర్ కాంఫిడెన్స్ మంచిది కాదు అని ఘాటు విమర్శలే చేసారు. అతను ఇలాంటి కామెంట్స్ చేయడానికి ఇండియా టెస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం కూడా ఒక కారణం.
కపిల్ దేవ్ చేసిన ఈ కామెంట్స్ కి టీం ఇండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెస్ట్ ఇండీస్ తో మూడో వన్ డే మ్యాచ్ కి ముందు మీడియా తో మాట్లాడిన జడేజా, "ఆయన ఈ మాటలు ఎప్పుడు అన్నారో నాకు తెలీదు" అంటూ, ప్రతి వ్యక్తికి ఒక అభిప్రాయం ఉంటుందని, అది అయన అభిప్రాయమని, అందరి అభిప్రాయం కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. టీం ఇండియా లో ఆడే ప్రతి ఆటగాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీం లో చోటు కాపాడుకోవాలని, మంచి ప్రదర్శనతో టీంని గెలిపించాలనే ఆడుతారని అన్నారు. టీం ఏదయినా ముఖ్యమైన మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఇలాంటి కామెంట్స్ రావడం సహజం అని అన్నారు. ప్రస్తుతం టీం ఇండియా మంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉందని, ఎవరికి ఎటువంటి అహంకారం, గర్వం లేవని అన్నారు. మూడవ వన్ డేలో గెలిచి తీరతాం అని ధీమా వ్యక్తం చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి