ఇటీవల కాలంలో టి20 లీగ్ లకు ఎంతలా ఆదరణ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిసిసిఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రత్యేకంగా టీ20 లీగులు నిర్వహిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో లేని కొన్ని కొత్త రూల్స్ ని కూడా అటు ఈ ఆయా టి20 లీగ్లలో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్లో ఎక్కడా చూడని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఐపీఎల్ లో బీసీసీఐ ప్రవేశపెట్టింది. అచ్చం ఇలాగే ఫుట్బాల్ తరహాలో రెడ్ కార్డు రూల్ ను అటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 అడిషనల్ లో ప్రవేశపెట్టారు.


 ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మ్యాచ్లో తొలిసారి ఎంపైర్లు రెడ్ కార్డు రూల్ వినియోగించారు అని చెప్పాలి.  రెడ్ కార్డు ద్వారా ఒక ఆటగాడిని మైదానం బయటికి పంపించారు.  కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సెయింట్ కిడ్స్ అండ్ నేవీ పేట్రియాడ్స్ మ్యాచ్,  ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ కు అంపైర్ రెడ్ కార్డు చూపించాడు. దీంతో ఏం చేయలేక మైదానాన్ని విడాల్సి వచ్చింది. అయితే ఇలా రెడ్ కార్డు రూల్ తో మైదానం వీడిన మొట్టమొదటి క్రికెటర్ గా నరైన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు అని చెప్పాలి.


 స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానాన్ని విడాల్సి ఉండడంతో.. అప్పటికే తన ఓవర్ల కోట పూర్తి చేసుకున్న సునీల్ నరైన్ పేరును  నైట్ రైడర్స్ కెప్టెన్ కిరణ్ పోలార్డు ప్రతిపాదించాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్ నరైన్ కు రెడ్ కార్డ్  చూపించాడు. దీంతో అతను మైదానాన్ని వీడాడు. అయితే ఈ రెడ్ కార్డు విధానం కొత్తేమీ కాదు. తరచూ చూస్తూనే ఉంటాం. అయితే క్రికెట్లో కాదు ఫుట్బాల్ లో. ఆటగాడు కఠినమైన పౌలుకు పాల్పడినప్పుడు అతని రెడ్ కార్ చూపించి మైదానం వీడేలా ఆదేశిస్తాడు రిఫరీ. ఇప్పుడు క్రికెట్ లోనూ ఫుట్బాల్ లో లాగా రెడ్ కార్డు రూల్ రావడం ఆసక్తికరంగా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: